నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసిపలు అభివృద్ధి పనుల పై చర్చించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద రూ. 4 కోట్ల రూపాయలతో చేపట్టబోయే నాల నిర్మాణం పనులు త్వరితగతిన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ కై నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చూడాలని, మట్టి రోడ్ల ప్రాంతాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అభివృద్ధి పనులలో వేగం పెంచేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. దీనికి వెంటనే స్పందించిన కమిషనర్ రోనాల్డ్ రాస్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నాల విస్తరణ పనులు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు.