- ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే చేవెళ్ల ఎంపీ డా. జి.రంజిత్ రెడ్డి చొరవతో రూ. 35 లక్షలు సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా కేటాయించారని తెలిపారు. అయితే కొత్త భవనం నిర్మాణంలో భాగంగా చేపడుతున్న సిహెచ్ ఓ & స్టాఫ్ రూమ్, హాల్ పనులను పరిశీలించేందుకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు.
అనంతరం శిథిలావస్థకు చేరుకున్న బోర్ బావిని పరిశీలించి అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆధునికరించి పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ రంజిత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. మౌలిక సదుపాయాలలో భాగంగా నూతన భవనం నిర్మించేందుకు నిధులు సమకూర్చినందుకు డివిజన్ ప్రజల తరపున వారికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, సిహెచ్ఓ స్వామి, జనార్దన్ రెడ్డి, గోపాల్ యాదవ్, రవి యాదవ్, ఉదయ్ యాదవ్, అలీం, సుమన్, యాదగిరి, మహేష్ చారీ, నర్సింహ, ముంతాజ్ బేగం, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.