- ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా నౌక తెలంగాణా ముద్దు బిడ్డా గద్దర్ తొలి జయంతి సందర్బంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కొల్లూర్ భరత్ ఆధ్వర్యంలో 15 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణ రావు ముఖ్య అతిథులుగా హాజరై గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు గద్దర్ అన్న కుమారుడు, కూతురు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపాటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు నివాళి అర్పించారు. పాల్గొన్న వారిలో కట నర్సింహా, రాజేందర్, జావీద్ హుస్సేన్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, ప్రధాన కార్యదర్శి సాయి కిషోర్, నర్సింగ్, సాయి నాయకులు పాల్గొన్నారు.