- కాలనీవాసులకు హామీ ఇచ్చిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : నల్లగండ్ల గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కు విన్నవించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ వేమన వీకర్ సెక్షన్, పోగుల ఆగయ్య (పి.ఏ) నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యులు, స్ధానికులు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్ నేతృత్వంలో జగదీశ్వర్ గౌడ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సమస్యల గురించి తెలిపారు. అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వేమన వీకర్ సెక్షన్ కు సంబంధించి, కాలనీ పెద్దలు అనిల్, మౌలాలి, యవజన నాయకులు పూసలపాటి వెంకటేశ్వర్లు, రమేష్, రాజు, పోగుల ఆగయ్య (పి.ఏ) నగర్ కి సంబంధించి సీనియర్ నాయకులు చంద్రయ్య, నరసింహ, బసంత్ కాలనీవాసులు పాల్గొన్నారు.






