- పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన శ్రీరాముని అక్షింతల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ గుల్మోహర్ కమాన్ నుండి నేతాజీ నగర్ కాలనీ లోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వరకు జరిగిన ఈ ఊరేగింపులో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ పాల్గొని మాట్లాడారు.
పిల్లలు, పెద్దలు, మహిళలు ప్రముఖులు, భక్తులు అందరు తరలివచ్చి శ్రీరాముని అక్షింతల ఊరేగింపును కన్నుల పండుగ చేసి విజయవంతం చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ శ్రీరాముని కృపాకటాక్షాలు దేశ ప్రజలందరి పై ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీరాముడిని కోరుకున్నట్లు చెప్పారు.
ఈ ఊరేగింపులో గుల్మోహర్ కాలనీ అధ్యక్షులు షేక్ ఖాసిం, బాలనర్సయ్య ఆర్ఎస్ఎస్, గుల్మోహర్ కాలనీ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, వెంకటేష్ గౌడ్, మోహన్ రావు, నిరంజన్ రెడ్డి, సత్యం సార్, మల్లేష్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, అందెల కుమార్ యాదవ్, శ్రీనివాస్, కే నరసింహ, నాగరాజు, సతీష్, వాసు, నగేష్ నాయక్, రమేష్ గుప్తా, అంజయ్య, కొడకంచి శ్రీశైలం యాదవ్, రామేశ్వరమ్మ, మణి, మేఘమాల పెద్ద ఎత్తున పాల్గొని ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.