- రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో మహా రక్తదానం శిబిరం
- పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి డైమండ్ హైట్స్ లో కల్వకొలను చిత్తరాంజన్ దాస్ ట్రస్ట్, సనాతన ధర్మ వారధి కల్వకొలను రామచంద్రమూర్తి 60వ జన్మదినం సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వహించారు. లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సంస్థ సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మ వారధి కల్వకొలను రామచంద్రమూర్తి 60వ జన్మదినం సందర్భంగా మహా రక్త దానం శిబిరం నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు. సనాతన ధర్మం కోసం కల్వకొలను రామచంద్రమూర్తి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. సమాజ హితం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపి సర్టిఫికెట్లను అందజేశారు. రక్తదానం శిబిరంతో పాటు రక్త పరీక్ష, కంటి పరీక్షా, షుగర్ చెకప్, ఇతర పరీక్షలు నిర్వహించడం జరిగినదని, వీటిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, ప్రసాద్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.