విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎన్నటికీ మరువను

  • 2003-2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2003-2004 లో చదువుకున్న విద్యార్థులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం (GET TOGETHER) ఆత్మీయతను చాటింది. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2003-04 బ్యాచ్ విద్యార్థులు కార్పొరేటర్ ని పూలమాల వేసి శాలువతో సత్కరించి శిల్డ్ ప్రదానం చేశారు.

2003-2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు, తన ఉపాధ్యాయులతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ..ఒక్కప్పుడు తాను ఇదే పాఠశాలలో చదువుకుని కార్పొరేటర్ స్థాయికి ఎదిగానని అందుకు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎన్నటికీ మరువనని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానని, భవిష్యత్తులో కూడా శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయులను సత్కరిస్తూ..

ప్రతిఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఆట పాటలు, చిల్లర పనులు కష్టం సుఖం ఇలా ఏదైనా కాని అన్నింట్లో మన వెన్నంటే ఉండీ సపోర్ట్ చేసేది స్నేహితులు మాత్రమేనని, అందరి కన్నా మన జీవితంలో చెరగని ముద్ర వేసేది పదవ తరగతి వరకు చదువుకున్న స్నేహితులు..వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికి మరచిపోనివి మరుపు రానివి అని పేర్కొన్నారు.

పాల్గొన్న పూర్వ విద్యార్థినులు

ఈ కార్యక్రమంలో కృష్ణ రెడ్డి, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, నిర్వాహకులు 2003-4 బ్యాచ్ విద్యార్థులు సురేష్ రాథోడ్, జమ్మయ్య, సురేష్, నర్సింగ్, శ్రీదేవి, రాకేష్, జమీల్, వెంకటేష్, నర్సింహా, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థినిలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here