- పక్కింట్లో నిద్రిస్తున్న చిన్నారి సమద్ స్పాట్ డెడ్…
- చికిత్స పొందుతూ శ్వాస విడిచిన వాహనదారుడు ఎండీ రషీద్…
నమస్తే శేరిలింగంపల్లి : వర్షం, ఈదురు గాలుల కారణంగా మియాపూర్ పీఎస్ పరిధిలోని హఫీజ్ పేట్ సాయినగర్‌లో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటిపై నుంచి పడిన ఇటుకల వల్ల ఇద్దరు మృతి చెందారు.
వివరాలు.. మియాపూర్ ఓల్డ్ హాఫీజ్ పేట్ సాయి నగర్ లో కురిసిన వర్షం ఈదురు గాలుల వల్ల స్థానికంగా ఐదంస్తుల భవనంలోని ఎస్.కే.కుర్షిద్ ఇంటి బాల్కనీ కూలీ పక్కనున్న రేకుల ఇంటిపై.. అదే దారిలో వెళ్తున్న మరో వ్యక్తిపై పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారి సమద్ (3) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆ దారిలో బైక్ పై వెళ్తున్న ఎండీ రషీద్ (45) తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో అతడిని స్థానిక శ్రీకర ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు.