రాయదుర్గం యాదవ సంఘం నూతన కమిటీకి ఘన సన్మానం

శేరిలింగంప‌ల్లి, న‌వంబర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాయదుర్గం యాదవ సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులను బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నూతన అధ్యక్షుడు అప్పల యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడు దానబోయిన రాజు యాదవ్‌తో పాటు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒంగోరు శ్రీనివాస్ యాదవ్, బీసీ సంఘం రాష్ట్ర యువజన విభాగం నాయకుడు అందెల కుమార్ యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, యువజన విభాగం అధ్యక్షుడు, కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాయదుర్గంలోని యాదవులకు నిరంతరం సేవలందించడంతోపాటు గ్రామ ప్రజలకు అవసరమైనప్పుడు సంఘం తరఫున ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్న యాదవ సంఘం సేవలను ప్రశంసించారు. యాదవులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి రాజకీయాల్లో రాణిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐకమత్యమే మహాబలమని, సంఘం సంఘటితంగా ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. సంఘం కేవలం సభ్యుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా ప్రజల తరఫున పోరాడాలని, యాదవుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం యాదవ సమాజ అభ్యున్నతి కోసం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here