దవాత్- ఏ – ఇఫ్తార్.. బట్టలు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి సోఫా కాలనీలోని మసీదు లో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ సాయి బాబా, గచ్చిబౌలి సిఐ సురేష్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరిమణులకు బట్టలు పంపిణీ చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. అనంతరం మాట్లాడుతూ మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఈ సందర్బంగా తెలిపారు.

ముస్లిం సోదర, సోదరిమనులకు బట్టలు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

రంజాన్ పండుగన ఏ వెలితి లేకుండా, ఎటువంటి లోటులేకుండా సంతోషకరంగా జరుపుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్తర్,సత్యనారాయణ, సురేందర్, MD. ఇబ్రహీం, నర్సింహ రాజు, రాజు ముదిరాజు, నవాజ్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here