గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వ్యక్తి

  • 250 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ , రూ. 16,250ల నగదును స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి : గంజాయి విక్రయిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. గచ్చిబౌలిలోని ఏపీహెచ్బీ కాలనీలో సవదత్తి రాజప్ప ప్రమోద్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్వోటీ మాదాపూర్ బృందం & గచ్చిబౌలి పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు.

పోలీసుల అదుపులో గంజాయి విక్రేత…

అతని వద్ద నుండి 250 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ , రూ. 16,250ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దూల్‌పేట్ నుంచి గంజాయిని సేకరించి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి కూలీలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. గచ్చిబౌలి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here