- ఆకట్టుకున్న చందానగర్ జ్యోతినాయర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన
నమస్తే శేరిలింగంపల్లి : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన వసంత నవరాత్రోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. ఇందులో భాగంగా చేపడుతున్న అక్కడ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇందులో భాగంగా చందానగర్ అపర్ణ హిల్స్ పార్కు నుంచి జ్యోతి నాయర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా ధర్మపురి క్షేత్రం వ్యవవస్థాపకురాలు భారతీయం సత్యవాణి మాట్లాడుతూ బాధ, దుఃఖం కలగలిసినదే జీవితమని, క్రోధి నామ సంవత్సరం అందరికీ శుభం, ఆరోగ్యం, సంపద, శాంతిని కలిగించాలన్నారు.