- ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు
- పాల్గొన్న శేరిలింగంపల్లి అబ్జర్వర్, టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్, ఎం.బి.సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్
నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్.జి.రంజిత్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలంటూ హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం గ్రామం, సుబాష్ నగర్, ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లలో ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు.
ఈ ప్రచారంలో శేరిలింగంపల్లి అబ్జర్వర్, టూరిజం డెవలప్ మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్, ఎం.బి.సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్, హాఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి సోదరి, వారి తనయుడు జి.రాజ్ ఆర్యన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారని, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని ప్రజలను కోరారు.