గంజాయి చాక్లెట్ల విక్రయ ముఠా అరెస్ట్

  • ఒరిస్సా కు చెందిన ఇద్దరి నుంచి 7 కిలోల గంజాయి స్వాధీనం

నమస్తే శేరిలింగంపల్లి: పలు పాన్ షాప్ లలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ ముఠా డిటిఎఫ్ శంషాబాద్ శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసుల చేతికి చిక్కారు. వారి వద్ద 7 కిలోల గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి. శేర్లింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ లక్ష్మణ్ గౌడ్ ఆ వివరాలు వెల్లడించారు. మాదాపూర్ పరిధిలోని చందా నాయక్ తండాలో ఒరిస్సా కు చెందిన ప్రశాంత్ కుమార్ పరిదా (30) విజయ్ గురు (30) లు పాన్ షాపులు నడుపుతున్నారు.

అయితే వారి పాన్ షాప్ లలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ డిటిఎఫ్, శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా గురువారం దాడులు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో రెండు చాక్లెట్లు విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. ఒక్కో ప్యాకెట్ లో 40 గంజాయి మిక్స్డ్ చాక్లెట్లు ఉండగా.. 39 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు ఏడు కిలోలు ఉన్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here