నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లిలోని లింగంపల్లి, దూబే కాలనీ, ఆదర్శనగర్, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, ఆరంభ టౌన్షిప్, శివాజినగర్ పలు వినాయక మండపాలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దర్శించుకున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు.
ఇందులో భాగంగా ఆరంభ టౌన్షిప్ లో వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాండియా కార్యక్రమాన్ని ప్రారంభించి, దాండియా ఆడిన మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, రవీంద్ర రాథోడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గఫర్ ఆయా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.