కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి

  • బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష
  • పాల్గొని మద్దతు తెలిపిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిరసన దీక్షలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు. మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని నాంపల్లి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్న బండి సంజయ్ మద్దతుగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ దౌర్జన్యాలకు, డబ్బుకు మేము తలోగ్గమని టీచర్లు తేల్చి చెప్పారు. కౌన్సిల్ లో కూడా మా తరపున మాట్లాడేందుకు బీజేపీ అభ్యర్థి ఉండాలని ఏవిఎన్ రెడ్డిని గెలిపించిన టీచర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం, ఉపాధ్యాయ వ్యతిరేక కేసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మా వెంట నడుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, నందీశ్వర్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. జి.మనోహర్ రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకుల విజయ, కార్యదర్శి జయశ్రీ, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షులు శివ సింగ్, సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, రంగస్వామి ముదిరాజ్, మున్నూరు సాయి, కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here