- 71 వ రోజుకు చేరిన గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర
నమస్తే శేరిలింగంపల్లి: గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర 71 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా హఫీజ్ పేట్ డివిజన్ అంబేద్కర్ నగర్, జనప్రియ నగర్, జనప్రియ అపార్ట్ మెంట్ లలో నిర్వహించగా.. ముఖ్య అతిథులుగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
నియోజకవర్గం కన్వీనర్ రాఘవేంద్రరావు, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, డివిజన్ ముఖ్య నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లారు. బిజెపి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వాలు ప్రజల హితువు కోరుతూ పరిపాలన కొనసాగించాలే తప్ప ప్రజలను ఇబ్బందులపాలు చేయొద్దని రవి కుమార్ యాదవ్ తెలిపారు. నియోజకవర్గంలో పరిపాలన గాడి త ప్పిందని, నాయకులు, అధికారులు దోచుకుతింటున్నారని, మొన్న కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖం చాటేసిన నాయకులు మళ్లీ ఎలా వచ్చి ఓటు అడుగుతారో సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పాదయాత్రలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని దాంట్లో ప్రధానమైనవి పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, మంచినీటి సరఫరా సరిగా లేదని, వర్షాకాలం వస్తే కాలనీ మొత్తం ముంపునకు గురవుతుందని తెలిసిందని, బిజెపి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, రవి గౌడ్, శ్రీశైలం, మాణిక్ రావు, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్, ప్రసాద్, పృథ్వీ గౌడ్, రవి ముదిరాజ్, అశోక్, ఆకుల లక్ష్మణ్, జగన్ గౌడ్, విజయేందర్, గణేష్ ముదిరాజ్, దేవాల్ యాదగిరి ముదిరాజ్, కౌశిక్, రామకృష్ణారెడ్డి, రాము, పవన్ యాదవ్, స్వప్న, సైదమ్మ పాల్గొన్నారు.