నమస్తే శేరిలింగంపల్లి: ఓల్డ్ హాఫిజ్ పేట్ సాయి నగర్ కాలనీ వాసులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపెటి జైపాల్ తెలిపారు. గురువారం ఓల్డ్ హాఫిజ్ పేట్ సాయి నగర్ కాలనీలో పర్యటించగా.. బస్తి వాసులు తాము పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. అయితే జీహెచ్ ఎంసీ కి ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని, స్థానికులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.