బీసీలకే పెద్దపీట..

  • అధిక శాతం వారికే సీట్లు కేటాయిస్తాం : బిసివై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
  • తెలంగాణ రాష్ట్ర బీసీవై పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన బీసీ ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాదులో భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా నేతలతో సమీక్షించి అభ్యర్థులను, పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తానని చెప్పారు. అదేవిధంగా బీసీవై పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూ ఎక్కువ శాతం బీసీలకి టికెట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న, తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి విభాగ అధ్యక్షులు పట్లోళ్ళ శ్రీరామ్ యాదవ్, నందగోపాల్, పాములేటి యాదవ్, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ని కలిసి బీసీ అభ్యర్థులని గెలిపించుకోవడానికి కృషి చేస్తామని, వారికి పూర్తి మద్దతు ప్రకటించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో బిల్డర్ ప్రసాద్ యాదవ్, నందకిషోర్ యాదవ్ ,తెలంగాణ రాష్ట్రం సర్పంచుల సంఘం అధ్యక్షులు భూమన్న యాదవ్, బీసీవై రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here