- గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ప్రజా సమస్యలను తెలుసుకుంటూ..
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోతున్నారని, మార్పు కోరుకుంటున్నారని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. కూకట్ పల్లి డివిజన్ ఆస్ బెస్టాస్ కాలనీలోని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుండి ప్రారంభమైన గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర లో మాట్లాడారు. ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రజాప్రతినిధులను ఇంటికి పంపాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని ప్రభుత్వ పథకాలను, రేషన్ కార్డులు, పింఛన్స్, ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నాయని, ఎటు చూసినా మురికివాడలు, రోడ్లు సరిగా లేవని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య ధోరణి వదిలి ప్రజల సమస్యలను పరిష్కరించాలని, ప్రజలలో చైతన్యం రావాలని పేర్కొన్నారు. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరనున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, శ్రీహరి యాదవ్ సీనియర్ నాయకులు వెంకటేష్, నరేష్, రఘునాథ్, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ పటేల్ ,బాలు యాదవ్, విజయ్ కుమార్, శ్రీనివాస్ పటేల్ ,సిద్దయ్య, రమేష్ యాదవ్, గోవర్ధన చారి, ప్రభాకర్, నర్సింగ్ రావు, శ్రీలత, అరుణ, లక్ష్మమ్మ, మణెమ్మ, రేణుక ,కల్పనా, సైదమ్మ , నరేందర్ పాల్గొన్నారు.
