నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వి – సాఫ్ట్ కన్సల్టింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వెర్ కంపెనీ ని కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, TSTS ఛైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు, ఐటి, పరిశ్రమల, వాణిజ్య ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామరాజు పాల్గొన్నారు.
