- రాయదుర్గం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు
- అనంతరం ప్రచారం చేపట్టిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలో బిఆర్ ఎస్ ప్రచారానికి మహిళా మణులు, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనం పలికారు. అంతకుముందు రాయదుర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.