నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ నుండి తెలంగాణ ఉద్యమకారుడు ధరమ్ వీర్ సింగ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.
మాజీ శాసన సభ్యులు భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు భిక్షపతి యాదవ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజాదరణతో బిజెపి రాబోయే ఎన్నికల్లో గద్దెనెక్కడం ఖాయమని స్పష్టం చేశారు.