నమస్తే శేరిలింగంపల్లి : ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి ఎన్ క్లేవ్ లోని న్యూ గుడ్ షప్పర్డ్, చెవిటి, మూగ స్కూల్ వద్ద సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాడిబోయిన రామస్వామి యాదవ్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు పెన్సిల్స్, రబ్బర్స్, పండ్లు, బిస్కెట్స్, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా సంఘసంస్కరణి, తొలి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలకు ముఖ్యంగా, స్త్రీల విద్యాభివృద్ధికి కృషిచేసిన మహిళ, ఉద్యమకారిణి ఆమె అని తెలిపారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మెర్సీ, అధ్యాపకురాలు శ్రీదేవి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జిల్ మల్లేష్, నరాల మహేశ్వర్ రెడ్డి, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వర రాజు పాల్గొన్నారు.





