కనులవిందుగా కేనరీ ది స్కూల్ వార్షికోత్సవం

  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  • చిన్నతనం నుంచే విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆ దిశగా ప్రోత్సాహించాలి : ముఖ్యఅతిథులు

నమస్తే శేరిలింగంపల్లి : కేనరి ది స్కూల్ 8వ వార్షికోత్సవం ఆనందోత్సాహాల నడుమ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యవస్థాపకుడు, ఇంజనీర్, ఆదిలక్ష్మి చింతలపాటి, పాఠశాల సలహాదారులు, పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, చైర్ పర్సన్ చప్పిడి శ్వేతా రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిథులతో పాటు ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా, అడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవర్చకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు.

వార్షికోత్సవ వేడుకలో విద్యార్థిని, విద్యార్థుల సందడి

విద్యతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు క్రీడలలో కూడా పాల్గొనేలా ప్రోత్సహించాలని, చిన్నారుల ప్రతిభను గుర్తించి వారిని చైతన్యవంతులని చేయాలని బావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ వేడుకలో అక్వాక్వెస్ట్, లాండ్ లైఫ్ లెగసీ అంశాలపై రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి.

సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్య ప్రదర్శనలో విద్యార్థినులు

ఈ సందర్భంగా విద్యార్థులు సహజ వనరుల గురించి అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా వారు ప్రదర్శించిన నృత్య కళా వేడుక అబ్బుర పరిచింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here