అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, చేనేత హస్తకళలు

నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో రెండు రోజుల పాటు శిల్పారామం, బెంగాలీస్ ఇన్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో ఎస్పీర్మితి -04 సాంస్కృతిక ప్రదర్శనలు, చేనేత హస్తకళలు, బెంగాలీ భోజన స్టాల్ల్స్ ఏర్పాటు చేసారు. ఈ స్టాల్లలో పెయింటింగ్ ప్రదర్శన నిర్వహించారు.

బెంగాలీ రాష్ట్రానికి చెందిన బెంగాలీ డిజైన్స్ తో కుర్తా, పైజామా, చేనేత చీరలు, డ్రెస్సులు , నగలు, వివిధ రకాల బెంగాలీ వంటకాలు, తీపి రుచులు, ఎన్నో సందర్శకులను ఆకట్టుకున్నాయి. దాదాపుగా ౩౦౦ మంది కళాకారులూ ప్రదర్శనలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here