నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని పీజేఆర్ స్టేడియం వద్ద ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పి .ఆర్ .కే హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 100 మందికి మధుమేహ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.

పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల మానవ జీవన శైలిలో పలు మార్పులు చోటు చేసుకోవడంతోపాటు , అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. అధిక దాహం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జన, త్వరగా అలసిపోవడం, చూపు మందగించడం, శరీరానికి తగిలిన గాయాలు త్వరగా మానకపోవడం, బరువు తగ్గడం, మొదలైన లక్షణాలు, మధుమేహ వ్యాధి సోకినట్లేనని తెలిపారు. అధిక కొవ్వు పదార్థాలు, రెడ్ మటన్, తీపి పదార్థాలు, ఆల్కహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, మానివేయాలని సూచించారు. నిత్యం వ్యాయామం చేయడం, నడక, మెడిటేషన్, యోగ, వంటివి కనీసం 40 నిమిషాల పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, జిల్ మల్లేష్, ఉమా చంద్రశేఖర్, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.