నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో పర్యావరణ హిత జీవన శైలి పై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో చందనగర్ సర్కిల్ డిసి సుధాన్ష్, ఏ ఎం హెచ్ ఓ డాక్టర్ కార్తిక్ తో కలసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు.

రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయలని, ప్లాస్టిక్ వలన కలిగే పర్యావరణ కాలుష్యంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. బట్ట, నార, కాగితపు సంచులను మాత్రమే వాడాలని, పవిత్ర జలాలను ప్లాస్టిక్ మయం కాకుండా భావితరాలకు కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించడానికి తమవంతు కృషిచేయలని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసి ఎస్ఎస్ శ్రీనివాస్, ఏస్ అర్ పి లు కనకరాజు, మహేష్, ఎస్ ఎఫ్ ఏ లు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.