నమస్తే శేరిలింగంపల్లి: ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, చెట్లను కాపాడి ప్రకృతి సమతుల్యత పెంపొందించాలని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నల్లగండ్లలోని లక్ష్మి విహార్ కాలనీలో జిహెచ్ఎంసి సహకారంతో నీటి ఇంకుడు గుంతలు రీఛార్జ్ చేయించారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటిని భూమిలోకి ఇణికించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, చెట్లను కాపాడి ప్రకృతి సమతుల్యత పెంపొందించాలని కాలనీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే అందరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అద్యక్షులు రవీంద్ర ప్రసాద్ దూబే, ప్రధాన కార్యదర్శి రాజశేకర్, కార్యదర్శులు రాజువల్లూరి, విద్యాసాగర్, రాంసుబ్బారెడ్డి, GHMC పారిశుద్ధ్య ఇంచార్జి భరత్, కాలనీ వాసులు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
