నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబీసీ మోర్చా బోయిన్ మహేష్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలపిన సందర్భాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేరని అన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలన్నీ విమోచన దినోత్సవాన్ని మర్చిపోవడం సిగ్గుచేటని, ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలకు పూనుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జితేందర్ సైఫుల్ల ఖాన్, సలీం, పవన్, శ్రీనివాస్, జాఫర్, ఇమ్రాన్ పాల్గొన్నారు.






