- శేరిలింగంపల్లిలో వేడుకగా నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలు
- మహనీయులకు నివాళి
- భరతమాతకు పుష్పాంజలి
నమస్తే శేరిలింగంపల్లి: నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలు శేరిలింగంపల్లిలోని చందానగర్ మార్కెట్ ప్లేస్, శ్రీదేవి థియేటర్ వద్ద, లింగంపల్లిలోని మధుకర్ స్మరక సమితి వద్ద నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యావేత్త, జిల్లా నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలు ఉత్సవ కమిటి గౌరవ అధ్యక్షులు, రావుస్ స్కూల్స్ చైర్మన్ పోలసాని ప్రభాకర్ రావు భారత మాత, సర్దార్ పటేల్ చిత్రపటాలకు పూజలు చేసి జోహార్లు సమర్పించారు. అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించి ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు.
సాయుధ తిరుగుబాటుల్లో అమరులైన వీరులకు నివాళులర్పించారు. భైరాన్ పల్లి, పరకాల, వరంగల్ తదితర ప్రాంతాల్లో రజాకార్ల సామూహిక హత్యలు, మానభంగాలు, దోపిడీల గురించీ వివరించారు. 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దీని వెనుక అనేకమంది వీరుల త్యాగం, రక్తతర్పణమూ ఉంది. అదే రక్తతర్పణం, అదే వీరుల త్యాగం నైజాం సంస్థానంలోనూ ఉంది. అయినా ఆ అర్ధరాత్రి ఇక్కడ స్వాతంత్య్ర భానూదయం కాలేదు. అందుకు కారకులు మతోన్మాది, నియంత నిజాం. అతని అడుగులకు మడుగులొత్తే రక్తపిశాచాలు రజాకార్లు. నిజాం సంస్థానం, ఇప్పటి తెలంగాణా అంతా, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొన్ని జిల్లాలు ఉండేవి. ఈ సంస్థానం భాష దృష్టితో మూడు భాగాలుగా విభజితమయింది.
- అందులో ప్రధానంగా మొదటిది ఎనిమిది జిల్లాలు కలిగిన తెలంగాణ.
- రెండో భాగం మరఠ్వాడా, మహారాష్ట్ర ప్రజలెక్కువగా ఉండే ప్రాంతమిది. ఇందులో అయిదు జిల్లాలు.
- మూడవ భాగం తెలంగాణ, మరఠ్వాడా కంటే కర్ణాటక ప్రాంతం చాలా చిన్నది. మూడు జిల్లాలు కలిగిన ఈ జిల్లాలో కన్నడం మాట్లాడేవారు ఎక్కువగా నివసిస్తారు.
కానీ, నిజాం మత్రం, ఇస్లాం మతపరమైన ఉర్దూ భాషను, అందరిమీద బలవంతం గా రుద్దాడు, తెలుగు, మరాఠి, కన్నడ లాంగ్వేజ్ స్కూల్స్ లేకుండా చేశాడు. కుట్రపూరితంగా హిందువులను భయపెట్టి ఇస్లాంలోకి మార్చాడు. నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపటానికి, కుట్రపూరితంగా ప్రయత్నం చేసినాడు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంలు, రజాకర్లు జరిపిన అత్యాచారాలు, అమానుష చర్యలు గురించి అందరు తెలుసుకోవాలన్నారు. నిజాం సంస్థానంలో రజాకార్లు చేసిన అక్రమాల్ని హత్యల్ని, దురంతాల్ని, విధ్వంసాలను తేదీలవారిగా కథనం చేస్తే కనీసం లక్ష పుటల చరిత్ర అవుతుందని అన్నారు.
1948, సెప్టెంబర్ 13న , సర్దార్ వల్లబాయి పటేల్ నేతృత్వంలో పోలో ఆపరేషన్ ప్రారంభమైంది, సెప్టెంబర్ 17న, భారత ప్రభుత్వానికి, నిజాం రాజు లొంగిపోయాడు. తెలంగాణకీ విమోచనము జరిగింది, స్వతంత్రం వచ్చినది, భారతీదేశంలో కలపబడినది. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి, పురుషోత్తంరెడ్డి, రవీందర్ రెడ్డి, పవన్, కోటిరెడ్డి, సురేష్, విద్యార్థులు, IT మరియు ఫార్మా ఎంప్లాయిస్, బస్తి ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.