- కులగణనకు ఏకగ్రీవ తీర్మాణంపై హర్షం వ్యక్తం చేసిన శేరిలింగంపల్లి బీసీ ఐక్య వేదిక సభ్యులు
నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పొందుపర్చిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణనపై ఏకగ్రీవ తీర్మాణం చేయడం సంతోషంగా ఉందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నల్లగండ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శేరిలింగంపల్లి బీసీ ఐక్య వేదిక సభ్యులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గాన్ని కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్, దిపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులుకు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నకే, బడుగు బలహీన వర్గాలు సామాజిక, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, భేరి రామచందర్ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, రమేష్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, నర్సింలు ముదిరాజ్, మాక్బుల్ భాయ్, నవాజ్, తిరుపతి, సెల్వరాజ్, సుజాత, పార్వతి, ప్రమీల పాల్గొన్నారు.