నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మాక్తా మహుబుబ్ పెట్ విలేజ్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యడు డాక్టర్ రంజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జి అర్ అర్, పౌండేషన్ ద్వారా మియాపూర్ డివిజన్ బి అర్ ఏస్ నాయకులు, ఉపాధ్యాయూలతో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని 10th క్లాస్ విద్యార్థులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఎగ్జామ్ ప్యాడ్స్ ను అందజేశారు. ప్రతి విద్యార్థికి అతి కీలకమైన విద్యా సంవత్సరం పదవ తరగతి అని అన్నారు. మంచి మార్కులతో పదవ తరగతి ఉత్తిర్ణులై చదువుకున్న పాఠశాలకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకోని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బి అర్ ఎస్, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.