గుల్‌మోహ‌ర్ పార్కు కాలనీలో ప‌ర్య‌టించిన జోన‌ల్‌క‌మీష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింప‌ల్లి వెస్ట్‌జోన్ జోన‌ల్ క‌మీష‌న‌ర్ ర‌వికిర‌ణ్ మంగ‌ళ‌వారం గుల్‌మోహ‌ర్ పార్క్ కాల‌నీలో ప‌లు విభాగాల అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పార్కులో కాల‌నీవాసుల‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. కాల‌నీలో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌ను స్థానికులు జెడ్ సి దృష్టికి తీసుకువ‌చ్చారు. వ‌ర్షాల కార‌ణంగా కూలిన ప్ర‌హ‌రీ పున‌ర్నిర్మాణం చేయాల‌ని, పార్కులో అభివృద్ది కాకుండా మిగిలి ఉన్న అర ఎక‌రం స్థ‌లాన్ని రాక్‌గార్డెన్‌గా అభివృద్ది చేయాల‌ని, పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య‌ను పెంచాల‌ని కోరారు. స‌మ‌స్య‌ల‌పై స్పందించిన జెడ్‌సి ర‌వికిర‌ణ్ త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్కుల డిడి నీర‌జ, మేనేజ‌ర్ యూసుఫ్‌, కాల‌నీ అధ్య‌క్షులు ఖాసీం ఉపాధ్య‌క్షులు మోహ‌న్‌రావు, ఆనంద్‌కుమార్, శేఖ‌ర్‌రావు, రామ‌సుబ్బ‌య్య‌, సూప‌ర్‌వైజ‌ర్ గోపాల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


గుల్‌మోహ‌ర్ పార్కు కాల‌నీ ప‌ర్య‌ట‌న‌లో జెడ్‌సి ర‌వికిర‌ణ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here