- ఈటెల రాజేందర్ సమక్షంలో బిఆర్ఎస్ నుండి బిజెపి లో చేరిన మదీనాగూడ వాసులు
- అధికార పార్టీ అహంకార పోగొడలను అడ్డుకోవాలంటే బీజేపీలో చేరాలి : రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: అధికార పార్టీ అహంకార పోకడలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలంటే ముదిరాజ్ బిడ్డలందరూ బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ కోరారు. గడపగడపకు బిజెపి కార్యక్రమం ద్వారా ప్రజల్లో నిత్యం ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రవి కుమార్ యాదవ్ ని అభినందించారు. అయితే మంగళ వారం హఫీజ్ పేట్ డివిజన్ మదినగూడ గ్రామం నుంచి ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముదిరాజుల ముద్దుబిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర సమక్షంలో షామీర్ పేట్ లో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలో అనేక కుల సంఘాల వారు బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పెద్దల ఆశీస్సులతో నియోజకవర్గ ఓటర్ల ప్రేమ, అభిమానాలతో ఈసారి కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో మాజీ కౌన్సిలర్ ఈగ సుధాకర్, యాదగిరి ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్, దయాకర్ రెడ్డి ,సత్యనారాయణ , అశోక్ గౌడ్ ,రమేష్ బండి, శివ ముదిరాజ్ రవి ఉన్నారు. కార్యక్రమం పాల్గొన్న వారిలో నాయకులు వినోద్ రావు, ఎల్లేష్, గణేష్ ముదిరాజ్, రవి ముదిరాజ్, శివరాజ్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ టర్బో పాల్గొన్నారు.