ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, ప్రకృతిని కాపాడుకుందాం

  • కెనరా ది స్కూల్ లో స్కూల్ ఎర్త్ డే వేడుకలు 
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఎర్త్ డే సందర్భంగా కెమెరా ది స్కూల్ విద్యార్థుల ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని ఎర్త్ డే సందర్భంగా పిలుపునిచ్చింది కెనరా ది స్కూల్ స్కూల్. ఎర్త్ డే సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా ఎర్త్ డే గీతను ప్రారంభించారు. అంతేకాక విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సేవ్ ఎలక్ట్రిసిటీ సందర్భంగా ఒక గంట పాటు ఇంటిలోని విద్యుత్ దీపాలను వెలిగించకుండా మద్దతు తెలిపారు.

సేవ్ ద ఎలక్ట్రిసిటీ లో భాగంగా

పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల సమావేశాలు, చిత్రలేఖన పోటీ నిర్వహించి అవగాహన కల్పించి బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల చైర్మన్ చప్పిడి శ్వేతారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడరు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడే మార్గాలని నిర్దేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మీడియా క్రిస్టియన్ మాట్లాడుతూ ప్రతిరోజు ఎర్త్ డే లాగా భావించాలని, పర్యావరణం కాపాడుకోవాలని, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పాఠశాల అడ్మిన్ మేనేజర్ మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here