నమస్తే శేరిలింగంపల్లి: కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ, స్టాలిన్ నగర్, కేకే ఎనక్లేవ్, గ్రీన్ వ్యాలీ, మక్తా మహబూబ్ పెట్, సత్యనారాయణ ఎనక్లేవ్, స్మైలీ ఎనక్లేవ్, లేక్ వ్యూ అపార్ట్ మెంట్స్, మియాపూర్ విలేజ్, ఫ్రెండ్స్ కాలనీ, ఆదిత్య నగర్, బాలాజీ నగర్, మయూరి నగర్, శ్రీల గార్డెన్స్, డోవ కాలనీ, అభయాంజనేయ కాలనీలలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో డీసీ సుధాంష్ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , సంబంధిత అధికారులతో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీ లలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ప్రజా సమస్యలు పరిష్కారం గా ముందుకు వెళ్లాలని, పారిశుధ్య నిర్వహణ పై అలసత్వం ప్రదర్శించరాదని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎం సి అధికారులు ఏ ఎం హెచ్ ఓ డాక్టర్ కార్తిక్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, ఏ ఈ శివ ప్రసాద్, SI రవి కుమార్, జలమండలి మేనేజర్ సాయి చరిత, ఎస్ ఆర్ పి కనకరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.