చెత్త సేకరణ బుట్టలు పంపిణీ చేసిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో GHMC పారిశుధ్య సిబ్బందికి స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ చెత్త సేకరణ బుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కరూ వివిధ కాలనీలలో ఇంటిలోని చెత్తను స్వచ్ఛ్ ఆటోలలో వేసే విధంగా, కాలనీలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని GHMC అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  శానిటేషన్ SRP లు కనకరాజు, SFA లు మహేష్, అగమయ్య, సునీల్, స్థానికులు కాలనీ అధ్యక్షుడు అన్నిరాజు, రమంజనేయ రెడ్డి, అశోక్ కుమార్ , వెంకట్ రెడ్డి, డివిజన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో GHMC పారిశుధ్య సిబ్బందికి స్థానిక నాయకులతో కలిసి చెత్త సేకరణ బుట్టలను అందజేసిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here