- డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దళిత సోదరులు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత రాజ్యంగ నిర్మాత, భారత రత్న . డా. బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి దళిత సోదరులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.
50ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని, ఎన్నో ఏళ్ల పోరాటానికి నేడు ఫలితం లభించిందన్నారు. మూడు దశాబ్దాల పోరాటాన్ని నిర్మించిన మంద కృష్ణ మాదిగకి, మిగతా ఉద్యమకారులందరికీ, ఈ అంశాన్ని సమర్థించిన అన్ని రాజకీయ పార్టీలకు ఎమ్మెల్యే గాంధీ తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్ ముదిరాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, కాశీనాథ్ యాదవ్, వినోద్, మల్లేష్, రాజేందర్, శ్రీనివాస్, వేణు గోపాల్ రెడ్డి, రాజేష్, పింటు, శ్రీను, సంతోష్, గౌస్ పాల్గొన్నారు.