నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొగా ఐదుగురికి సీఎం ఆర్ ఎఫ్ నుంచి రూ. 1లక్ష 68 వేల 500 మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సీఎం ఆర్ చెక్కులను గౌరవ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమన్నారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే పునరుద్గాటించారు. వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్ ముదిరాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, కాశినాథ్ యాదవ్, శివరాజు గౌడ్, మల్లేష్, వినోద్, వేణు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజేందర్, పింటు, మంజుల, రాజ్యలక్ష్మి, మధులత, అరుణ, శ్రీలత, లక్ష్మీ పాల్గొన్నారు.