నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బి.ఆర్. అంబెడ్కర్ అడుగుజాడల్లో నడవడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా బి.ఆర్.అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డిలో కార్పొరేటర్ కార్యాలయంలో డా.బి.ఆర్. అంబెడ్కర్ చిత్ర పటానికి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధిపత్య ధోరణులకు, వివక్షకు తావివ్వకుండా సమస్త మానవులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో పరోపకారం ఫరిడవిల్లేలా కలిసిమెలసి జీవించాలనే, వసుధైక కుటుంబ ధృక్పథాన్ని తన రాజ్యాంగం ద్వారా పౌర సమాజానికి అందించిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, విలువలను అనుసరిస్తూ, దళిత బహుజన పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడటమే ఆ మహానుభావునికి మనమిచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, ఆర్ వెంకటేష్, తిరుపతి, ఇందిరా, గచ్చిబౌలి డివిజన్ కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావు, వరలక్ష్మి, కవిత భాయ్, నర్సింగ్ నాయక్, ప్రభాకర్, శేఖర్, దార్గుపల్లి అనిల్, ఈశ్వర్, శ్రీకాంత్ రెడ్డి, అరవింద్ సింగ్, నర్సింగ్ రావు, దుర్గరామ్, యాదయ్య, అర్జున్, గణేష్, మధు, యాదయ్య, నగేష్, సతీష్, శేఖర్ రెడ్డి, సముందర్ సింగ్, శ్రవణ్ సింగ్, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.