రాజ్యాంగ నిర్మాత కు ఘన నివాళి

  • ఎంపీపీస్ స్కూల్ విద్యార్థులతో కలిసి నివాళులర్పించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి లోని రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. మనిషి మనిషిగా గౌరవించే కుల రహిత మానవ సమాజాన్ని నిర్మించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పసునూరి రవీందర్, వార్డు మెంబెర్ శ్రీకళ, సందయ్యనగర్ కాలనీ అధ్యక్షులు బస్వరాజ్ లింగయత్, ప్రవీణ్, శ్రీకాంత్, రాజు, హరి, పాపిరెడ్డి కాలనీ బస్తీ కమిటీ ప్రెసిడెంట్ సాయినందన్ ముదిరాజ్, ఎంపీపీస్ స్కూల్ హెచ్ఎం దేవదాసు, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, సాయి, మహేష్ రాపన్, మహిళా నాయకురాలు సౌజన్య, కళ్యాణి, సుధారాణి, రోజరాణి, రజని, జయమ్మ, ఎంపీపీస్ పాఠశాల విద్యార్థులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఎంపీపీస్ స్కూల్ విద్యార్థులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here