అంబేడ్కర్ అడుగుజాడల్లో ముందు కెల్దాం : కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: డా. బిఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్ లోని అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు కార్పొరేటర్ హమీద్ పటేల్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, అపార మేధావి, నిమ్న వర్గాల ఆశాజ్యోతి డా బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ప్రజలు ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఆ మహనీయుడు ఆలోచనలు ఆచరణలో పెట్టుకొని, ముందుకు వెళ్లాలని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టటం, దళితబంధు పధకం ద్వారా దళితుల పట్ల కేసీఆర్ కి, తెరాస ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. తెరాస పార్టీ సీనియర్ నాయకులు నందు, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవరాజు, బుడుగు తిరుపతి రెడ్డి, సాగర్ చౌదరి, ఉప్పులూరి ఆనంద్, ఫాజిల్, బల్లు, కుమార్, విజయ్ కుమార్, సదర్ సాయి కుమార్, లక్ష్మి బాయి, సదర్ రాము, విజయ్, కైలా రాజేందర్ రెడ్డి, సోను పాల్గొన్నారు.

సిద్దిఖ్ నగర్ లోని అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here