అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడదం

  • సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపు నిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని శేరిలింగంపల్లి పరిధిలో ఇజ్జత్ నగర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళిత గిరిజన మైనార్టీ పేదల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి ప్రపంచం గర్వించే పద్ధతిలో రాజ్యాంగాన్ని రాసిన మహానీయుడని ఆయన కొనియాడారు. ఎస్సీ, ఎస్టీల పై అంటరానితనాన్ని పోగొట్టాలని ఎన్నో పోరాటాలు నిర్వహించిన పోరాట వీరుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.నివాళులర్పించిన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కే రామస్వామి, టీ రామకృష్ణ, జిల్లా సమితి సభ్యుడు కే చందు యాదవ్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జడ్పీ శ్రీనివాస్ ఉన్నారు.

శేరిలింగంపల్లి పరిధిలో ఇజ్జత్ నగర్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here