అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని చేద్దాం : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : భారత రాజ్యాంగ రూపశిల్పి, డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్థంతిని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ నివాసం వద్ద నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రోజాదేవి రంగరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ఆ మహనీయునీ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా  ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టి కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనం, అసమానతలు, వివక్షాల పై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని పేర్కొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, ఉరిటీ వెంకట్ రావు, గోపారాజు శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, చంద్రమోహన్ సాగర్, మోజేశ్, పోశెట్టి గౌడ్, కృష్ణ రావు, రాము, ఆంజనేయులు, రాము గౌడ్ , విద్య సాగర్, సురేష్, శ్రావణి రెడ్డి, విజయ మరియు పాల్గొన్నారు.

కార్పొరేటర్ల తో కలిసి భారత రాజ్యాంగ రూపశిల్పి, డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here