నమస్తే శేరిలింగంపల్లి: నందిగామలోని రూ 5 కోట్ల విలువైన అర ఎకర భూమిని దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్, గౌడ్ హాస్టల్ ఉపాధ్యక్షుడు గౌడ హాస్టల్ నూతన నిర్మాణం కోసం విరాళం అందజేసిన విషయం తెలిసిందే. ఇందుకు శుక్రవారం శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం తరఫున దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ ని ఘనంగా సన్మానించారు.

హాస్టల్ కు సంబంధించిన వార్త 22 న్యూస్ పేపర్లలో రావడం ఒక అచీవ్ మెంట్ గా భావించి బిఆర్ఎస్ చందానగర్ డివిజన్ యువజన అధ్యక్షుడు, ఆయన మనువడు దొంతి కార్తీక్ గౌడ్ అన్ని పేపర్లను జత చేసి ఒక ఫోటో ఫ్రేం చేయించి చందానగర్ జవహర్ కాలనీలో నివాసం ఉంటున్న తన తాతను స్థానిక గౌడ బృందంతో కలిసి ఆ మెమెంటోను అందజేశారు. ఈ వార్త అన్ని పేపర్లలో రావడానికి కృషిచేసిన పుట్ట వినయ్ కుమార్ కు మన స్పూర్తిగా దొంతి కార్తీక్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరేని యాదగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, వెంకటపతి గౌడ్, వీరేషం గౌడ్, తాళ్ళ ఆనంద్ గౌడ్, దొంతి దీపక్ గౌడ్, దొంతి చైతన్య గౌడ్, ఆర్. నరేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, శ్రీపాల్ గౌడ్లు పాల్గొన్నారు.
