- సిపిఆర్ తో వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
- అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,
నమస్తే శేరిలింగంపల్లి: ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన బాలరాజు ఆరంఘర్ చౌరస్తా వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు. అక్కడే విధుల్లో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ అతనికి సిపిఆర్ చేశాడు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంటనే అతని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడు. సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి హర్షవర్ధన్, ఐపిఎస్., శంషాబాద్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస నాయుడు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి సమక్షంలో సైబరాబాద్ సీపీ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని అభినందించి రివార్డు అందజేశారు.
