ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

  • డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సెంటర్ మేనేజర్ K.నాగమల్లిక
  • నర్సింగ్ (GDA) లో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు

నమస్తే శేరిలింగంపల్లి: కల్లం అంజిరెడ్డి విద్యాలయ చందానగర్ వద్ద నర్సింగ్ (జనరల్ డ్యూటీ అసిస్టెంట్) లో నిరుద్యోగులకు ఉచితంగా వసతి సౌకర్యం, నాణ్యమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 350 మంది నిరుద్యోగ యువతకు అత్యుత్తమ శిక్షణ అందించామని, వారు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉపాధి అవకాశాలు పొందారని, ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. GDA కోర్స్ లో శిక్షణ పొందాలనుకునే వారు 19-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి , కనీసం పదవ తరగతి పూర్తి చేసి ఉండాలని, త్వరలో మరొక బ్యాచ్ మొదలవుతుందని తెలిపారు. ఆసక్తి కలవారు 8978999043, 6302471012 ఈ నెంబర్లలో సంప్రదించ గలరని చెప్పారు. ఈకార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సిబ్బంది రవి, తారామణి, ప్రీతి మెర్సీ, మల్లేశం పాల్గొన్నారు.

 

నర్శింగ్ విద్యార్థినులతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ యాజమాన్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here