నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని కేఎంఆర్ ఎస్టేట్స్ లోని రాఘవేంద్ర షల్టర్స్, తదితర అసోసియేషన్ సభ్యుల కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా వార్డు కార్యాలయంలో కలిసి సిసి రోడ్, భూగర్భ డ్రైనేజీ సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందచేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. డివిజన్ లోని ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తానని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సికెందర్ షా, పల్లవ్, అంకిత్ అగర్వాల్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, శేరిలింగంపల్లి డెవలప్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, మిలన్ కుమార్, రవితేజ, సికెందర్, అర్షద్ ఆలం, సంతోష్, రఘు, రవి కుమార్, శ్రీ హర్ష, ప్రసాద్ కేఎంఆర్ ఎస్టేట్స్ లోని తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు