శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ & తహసిల్దార్ కలిసి విన్నవించిన శేరిలింగంపల్లి నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ & తహసిల్దార్ గా కె.వెంకా రెడ్డి నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చెరువులు, కుంటలను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూకబ్జా లపై ఒక్కొక్కటిగా వివరించారు. డిప్యూటి కలెక్టర్ సానుకూలంగా స్పందించి శేరిలింగంపల్లి మండలం పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై మరే ఇతర సమస్యలున్న పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు.

కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవరెడ్డి, వీరమల్ల వీరేందర్ గౌడ్, బి.కృష్ణ ముదిరాజ్, దినేష్ రాజ్, ముద్దంగుల తిరుపతి, బి.నాగరాజ్ పాల్గొన్నారు.